kcr: కేసీఆర్ వైఖరి ప్రజాస్వామ్యానికి కోలుకోని దెబ్బ: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • కేసీఆర్ వికృతంగా వ్యవహరిస్తున్నారు
  • ఇద్దరు ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలి
  • ఈనెల 5న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విధానంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని... అయినా ప్రజాతీర్పును తాము గౌరవించామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వికృతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంఖ్యాబలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఐదో అభ్యర్థిని బరిలోకి దించారని దుయ్యబట్టారు.

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేశారని... వారిద్దరినీ ఎంతకు కొన్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వైఖరిని ప్రజలంతా గమనించాలని చెప్పారు. ఈనెల 5న కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ లో చేరుతున్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేసి, ఎమ్మెల్సీ ఎన్నికలకు వారిని దూరంగా పెట్టాలని స్పీకర్ ను కలిసి కోరుతామని చెప్పారు.

More Telugu News