USA: అమెరికా ఎగుమతులపై భారత్ సుంకాలు తగ్గించాలి... ట్రంప్ వార్నింగ్!

  • అమెరికా-భారత్ మధ్య పన్నుల వ్యవహారం
  • ఇండియా భారీగా సుంకాలు విధిస్తోందని ట్రంప్ మండిపాటు
  • హార్లేడేవిడ్ సన్ బైక్ ను ప్రస్తావించిన అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాపై తన అక్కసును వెళ్లగక్కారు. భారత్ ప్రపంచంలోనే అధికంగా పన్నులు విధించే దేశమని ఆరోపించారు. అమెరికా ఎగుమతి చేస్తున్న చాలా అమెరికన్ వస్తువులపై భారత్ 100 శాతం పన్ను విధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అమెరికా మాత్రం ఈ స్థాయిలో భారత ఉత్పత్తులపై పన్నులు విధించడం లేదన్నారు. ఈ సందర్భంగా హార్లే డేవిడ్ సన్ బైక్ అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు.

రాజధాని వాష్టింగన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ భారత్ కు పరోక్ష హెచ్చరికలు చేశారు. భారత్ వెంటనే తన సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే అదే స్థాయిలో భారత ఉత్పత్తులపై సుంకాలు పెంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు. లగ్జరీ బైక్ కంపెనీ హార్లే డేవిడ్ సన్ బైక్ పై భారత్ గతంలో 100 శాతం సుంకాన్ని విధించేది. అయితే ట్రంప్ ఈ విషయాన్ని మోదీ వద్ద ప్రస్తావించడంతో ఈ సుంకాన్ని కేంద్రం 50 శాతానికి తగ్గించింది. అయినప్పటికీ శాంతించని ట్రంప్.. ఇంకా తగ్గించాలని డిమాండ్ చేశారు.

More Telugu News