Rashikhanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'వెంకీ మామ'తో జాయిన్ అయిన రాశి 
  • 'వాల్మీకి' కోసం చెమటోడుస్తున్న వరుణ్
  •  మరో షెడ్యూలుకు సందీప్ కిషన్ సినిమా 

*  వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న 'వెంకీ మామ' చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం షూటింగులో రాశిఖన్నా జాయిన్ అయింది. చైతూ సరసన ఆమె ఇందులో నాయికగా నటిస్తోంది.
*  హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వాల్మీకి' చిత్రం కోసం హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. 'జిగర్తాండ' తమిళ హిట్ చిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది.
*  జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న కామెడీ చిత్రం 'తెనాలి రామకృష్ణ బిఏబిఎల్' చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 7 నుంచి తిరిగి కర్నూలులో జరుగుతుంది. ఇందులో హన్సిక కథానాయికగా నటిస్తోంది. 

More Telugu News