nagashouraya: నాగశౌర్య .. మాళవిక జంటగా అవసరాల మూవీ

  • తెరపైకి మరో ప్రేమకథ
  • దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్
  • మార్చి 2వ వారం నుంచి షూటింగ్  

నాగశౌర్య .. మాళవిక నాయర్ జంటగా ఒక విభిన్నమైన ప్రేమకథ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ .. దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాకి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. మార్చి 2వ వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

ఇంతకుముందు అవసరాల శ్రీనివాస్ .. నాగశౌర్య కాంబినేషన్లో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే'.. 'జ్యో అచ్యుతానంద' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక నాగశౌర్య - మాళవిక నాయర్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'కల్యాణ వైభోగమే' సినిమా కూడా మంచి మార్కులు సంపాదించుకుంది. అలాంటి ఈ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందనుండటం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

More Telugu News