team india: టీమిండియా విజయలక్ష్యం 237 పరుగులు.. ధావన్ డకౌట్

  • 50 పరుగులు చేసిన ఖవాజా
  • ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ
  • తొలి బంతికే పెవిలియన్ చేరిన ధావన్

హైదరాబాదులో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కట్టడి చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే ఆసీస్ కు బుమ్రా షాక్ ఇచ్చాడు. స్కోరు బోర్డుపై పరుగులేమీ చేరకుండానే ఫించ్ ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు.

తర్వాత రెండో వికెట్ కు ఖవాజా (50), స్టోయినిస్ లు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తరుణంలో జాధవ్ బౌలింగ్ లో స్టోయినిస్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆసీస్ వికెట్లు క్రమం తప్పకుండా పడిపోయాయి. హ్యాండ్స్ కోంబ్ 19, మ్యాక్స్ వెల్ 40, టర్నర్ 21, కౌల్టర్ నైల్ 28 పరుగులు చేశారు. క్యారీ 36, కమిన్స్ 0 నాటౌట్ గా నిలిచారు.

భారత బౌలర్లలో షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ లు చెరో రెండు వికెట్లు తీయగా... జాధవ్ ఒక వికెట్ పడగొట్టాడు. 237 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కౌల్టర్ నైల్ బౌలింగ్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే ధావన్ ఔట్ అయ్యాడు. మ్యాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ (4), కోహ్లీ (0) క్రీజులో ఉన్నారు.

More Telugu News