India: ఐఏఎఫ్ పైలట్ అభినందన్ కులం ఏంటి?.. ఇంటర్నెట్ లో తెగ వెతికేసిన భారతీయులు!

  • టాప్ ప్లేస్ లో నిలిచిన గుజరాత్
  • జాబితాలో తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు
  • నిన్న పాక్ చెర నుంచి విడుదలైన అభినందన్

పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూల్చివేసి , పాక్ సైన్యానికి చిక్కిన భారత పైలట్ అభినందన్ నిన్న సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. వాఘా-అట్టారి సరిహద్దులో ప్రజలు భారీగా గుమిగూడి వింగ్ కమాండర్ అభినందన్ కు స్వాగతం పలికారు. అయితే ఈ సందర్భంగా అభినందన్ పూర్వాపరాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపారు. ముఖ్యంగా అభినందన్ ఏ కులానికి చెందినవాడో తెలుసుకోవడానికి గూగుల్ లో తెగ వెతికేశారు.

‘అభినందన్ క్యాస్ట్’ ‘అభినందన్ క్యాస్ట్ జైన్’ ‘ఈజ్ అభినందన్ వర్ధమాన్ జైన్’ ‘వర్ధమాన్ క్యాస్ట్ ఇన్ సౌతిండియా’ అని గుగూల్ లో సెర్చ్ చేశారు. అభినందన్ వర్ధమాన్ కులం గురించి తెగ వెతికిన రాష్ట్రంగా గుజరాత్ తొలిస్థానంలో నిలిచింది. ఆయన కులం గురించి తెలుసుకునేందుకు గుజరాతీ ప్రజలు చాలా ఆసక్తి చూపారు. తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

More Telugu News