kalyanram: నా తమ్ముడు ఎన్టీఆర్ ముందే చెప్పాడు .. అదే నిజమైంది: కల్యాణ్ రామ్

  • ఈ కాన్సెప్ట్ ను ఒప్పుకోవడం మంచిదైంది
  • కొత్తదనాన్ని ఎప్పుడూ ఆదరిస్తారు
  •  దిల్ రాజు గారికి ధన్యవాదాలు    

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా గుహన్ దర్శకత్వంలో రూపొందిన '118' నిన్ననే థియేటర్లకు వచ్చింది. నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా నటించిన ఈ సినిమా, తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, ఈ సినిమా టీమ్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది.

ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "గుహన్ గారు ఈ కాన్సెప్ట్ ను నాకు చెప్పినప్పుడు నేను ఒప్పుకోకపోయుంటే ఇప్పుడు చాలా బాధపడేవాడినేమో. కథలో కొత్తదనం వుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. నా తమ్ముడు ఎన్టీఆర్ ఈ సినిమా చూడగానే, తప్పకుండా దీనిని ప్రేక్షకులు ఆదరిస్తారని ఎంతో నమ్మకంతో చెప్పాడు .. నా తమ్ముడు చెప్పిందే నిజమైంది. మా మీద నమ్మకంతో ఈ సినిమాను కొన్న దిల్ రాజుగారికి .. ఆదరిస్తోన్న ప్రేక్షకులకు మా ధన్యవాదాలు" అని అన్నాడు.

More Telugu News