Abhinandan: అభినందన్ భారత్ చేరుకునే వరకు ఇమ్రాన్ బిజీ!

  • అభినందన్ అప్పగింత వ్యవహారాన్ని దగ్గరుండి చూసుకున్న ఇమ్రాన్
  • అభినందన్ వాఘా తరలింపుకు ముందే లాహోర్ చేరుకున్న పీఎం
  • భారత్‌కు అప్పగించాకే తిరిగి ఇస్లామాబాద్‌కు

కోట్లాది మంది ఎదురుచూపులు ఫలిస్తూ భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం రాత్రి 9:15 గంటలకు మాతృదేశంలో అడుగుపెట్టాడు. అంతకుముందు పెద్ద హైడ్రామానే నడిచింది. తొలుత 3 గంటలకు అభినందన్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన పాక్ ఆ తర్వాత రెండుసార్లు సమయాన్ని మార్చింది. చివరికి దౌత్యపరమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం భారత్‌కు అప్పగించింది.

అయితే, అభినందన్ భారత్ చేరుకునే వరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్షణం తీరికలేకుండా గడిపారు. పైలట్‌ను భారత్‌కు అప్పగించే వరకు క్షణక్షణం పర్యవేక్షించారు. అభినందన్‌ను వాఘా సరిహద్దుకు తరలించడానికి కొన్ని గంటల ముందు లాహోర్ చేరుకున్న ఇమ్రాన్ అప్పగింత వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించారు. అభినందన్ అప్పగింత సవ్యంగా జరిగేలా చూసేందుకే ఇమ్రాన్ లాహోర్ వచ్చినట్టు ఆ దేశంలోని పంజాబ్ ముఖ్యమంత్రి  ఉస్మాన్‌ బుజ్దార్‌ చెప్పారు. వింగ్ కమాండర్‌ను భారత్‌కు అప్పగించిన తర్వాత ఇమ్రాన్ తిరిగి ఇస్లామాబాద్‌ వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు.  

More Telugu News