Randeep Surjewala: మోదీ ప్రాధాన్య అంశాలను పక్కనబెట్టి.. ఎన్నికలపైనే దృష్టి పెట్టారు: రణ్‌దీప్ సూర్జేవాలా ఫైర్

  • అభినందన్ క్షేమంగా రావాలని ప్రార్థనలు
  • ముఖ్యమైన ర్యాలీలను రద్దు చేసుకున్నాం
  • మోదీ రికార్డ్ కోసం ప్రయత్నించడం దురదృష్టకరం

 పాక్ చేతిలో చిక్కిన పైలెట్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని యావత్ భారతదేశం ప్రార్థనలు చేస్తుంటే, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డు సృష్టించాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రణ్‌దీప్ సూర్జేవాలా ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మోదీ బూత్ స్థాయి కార్యకర్తలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ నిర్శహించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్య అంశాలను పక్కనబెట్టి, రాబోయే ఎన్నికలపైనే దృష్టి పెట్టారంటూ రణ్‌దీప్ ఫైర్ అయ్యారు. ‘ప్రాధాన్య అంశాలను పక్కనపెట్టేశారు. వింగ్ కమాండర్‌ అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని 132 కోట్ల మంది భారతీయులు ప్రార్థిస్తుంటే.. మోదీ మాత్రం రాబోయే ఎన్నికలపైనే  దృష్టి పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ చాలా ముఖ్యమైన  సీడబ్ల్యుసీ, ర్యాలీలను రద్దు చేసుకుంది. ప్రధాన మంత్రి మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రికార్డు కోసం ప్రయత్నించడం దురదృష్టకరం’ అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News