ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే ‘బస్సు యాత్ర’ చేపడతా: వైఎస్ జగన్

28-02-2019 Thu 20:09
  • ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం
  • అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో భేటీ
  • సమర్థత ఉన్న వారికే ఎన్నికల ఇంఛార్జ్ లుగా బాధ్యత 
వైసీపీ అధినేత జగన్ మరోసారి ‘యాత్ర’కు సిద్ధమవుతున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బస్సుయాత్ర చేపట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే తన బస్సు యాత్రను ప్రారంభించనున్నట్టు జగన్ తెలిపారు. కాగా, తమ పార్టీకి చెందిన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఇంఛార్జ్ లతో జగన్ సమావేశమయ్యారు. సమర్థత ఉన్న వారికే ఎన్నికల ఇంఛార్జ్ లుగా బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ తర్వాత ఒకట్రెండు రోజుల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నట్టు సమాచారం. వచ్చే నలభై ఐదు రోజులు చాలా కీలకమని,   కలిసొచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకోవాలని సూచించారు.