పింఛన్‌దారులకు అందించేందుకు స్వీట్ బాక్సులను సిద్ధం చేసిన వైసీపీ.. సీజ్ చేసిన అధికారులు

Thu, Feb 28, 2019, 06:58 PM
  • మచిలీపట్నంలోని ఓ హోటల్‌లో తనిఖీ
  • 150 స్వీట్ ప్యాకెట్లతో కూడిన 27 కార్టన్ల సీజ్
  • బాధ్యులపై కేసు నమోదు చేస్తామన్న సంపత్
మార్చి 1 నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ సందర్భంగా పింఛన్ దారులకు ఇచ్చేందుకు తమ పార్టీ గుర్తులతో కూడిన స్వీట్ ప్యాకెట్లను వైసీపీ సిద్ధం చేసింది. అయితే ఈ సమాచారం అందుకున్న అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా స్వీట్ బాక్సుల పంపిణీ నిబంధనలకు విరుద్ధమని వాటిని స్వాధీనం చేసుకున్నారు. మచిలీపట్నంలోని ఓ హోటల్‌లో తనిఖీ చేసిన అధికారులు 150 స్వీట్ ప్యాకెట్లతో కూడిన 27 కార్టన్లతోపాటు మరికొన్ని ఖాళీ బాక్సులను అధికారులు సీజ్ చేశారు. ఈ విషయమై కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్ బాధ్యులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad