abhinandan: అభినందన్ విషయంలో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం: పాకిస్థాన్

  • అభినందన్ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు
  • యుద్ధ ఖైదీగా పరిగణించాలా? లేదా? అనే విషయంలో రెండు రోజుల్లో నిర్ణయం
  • భారత్ ఆరోపణల అనంతరం పాక్ స్పందన

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ ను పాకిస్థాన్ అదుపులో ఉంచుకోవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముహమ్మద్ ఫైసల్ మాట్లాడుతూ, అభినందన్ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అభినందన్ ను యుద్ధ ఖైదీగా పరిగణించాలా? లేదా? అనే విషయంలో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పైలట్ అభినందన్ ను పాక్ ఆర్మీ ఇబ్బందులకు గురి చేస్తోందని... జెనీవా ఒప్పందానికి తూట్లు పొడుస్తోందని భారత రక్షణ అధికారులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఈ మేరకు స్పందించింది.

More Telugu News