Telangana: తెలంగాణ ఆరోగ్య మంత్రిగా ఈటల బాధ్యతలు.. అప్పుడే కొత్త తలనొప్పి!

  • పేదలకు నాణ్యమైన వైద్యమే కేసీఆర్ లక్ష్యం
  • అందుకే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు
  • విధుల్లో చేరాలని జూడాలకు మంత్రి విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నేత ఈటల రాజేందర్ ఈరోజు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. అందుకు అనుగుణంగానే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో రోగుల బంధువులు వైద్యులపై దాడి చేయడాన్ని మంత్రి ఖండించారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వైద్యులపై దాడి చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.

ఈ ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోగుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వెంటనే సమ్మెను విరమించాలని జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈటల ప్రతిపాదనను జూనియర్ డాక్టర్లు తిరస్కరించారు. దీంతో బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈటలకు కొత్త తలనొప్పి వచ్చిపడింది.

More Telugu News