ap7am logo

జగన్ అన్నా.. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా!: మంచు విష్ణు

Thu, Feb 28, 2019, 01:05 PM
  • వైసీపీ అధినేతను కలుసుకున్న విష్ణు
  • జగన్ కల సాకారం కావాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి
  • వైసీపీ అధినేత బాబాయ్ కుమార్తెను పెళ్లాడిన విష్ణు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ గుంటూరు సమీపంలోని తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటిలో నిన్న గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూడా జగన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జగన్ బంధువు, సినీనటుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో స్పందించారు. జగన్ కు అంతా మంచి జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈరోజు ట్విట్టర్ లో మంచు విష్ణు స్పందిస్తూ..‘అందమైన ఇంటిలో జగన్ అన్నకు అంతా మంచే జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. మీ కలలను సాకారం చేసుకునే దిశగా ఆ దేవుడు మీకు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. జగన్ సొంత బాబాయ్ కుమార్తె అయిన వెరోనికా రెడ్డిని మంచు విష్ణు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Latest Video News..
Advertisement