Andhra Pradesh: వైజాగ్ రైల్వే జోన్ పై గంటా అసంతృప్తి.. మళ్లీ ఏపీని మోసం చేశారని ఆవేదన!

  • ఏపీ విభజన సందర్భంగా అన్యాయం జరిగింది
  • హైదరాబాద్ ను తెలంగాణకు ఇచ్చేశారు
  • ఇప్పుడు వాల్తేరును ఒడిశాకు అప్పగించేశారు

కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంకు రైల్వేజోన్ ప్రకటించిన తీరుపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014లో ఏపీ విభజన సందర్భంగా జరిగిన అన్యాయమే రైల్వే జోన్ ఏర్పాటులోనూ జరిగిందని విమర్శించారు. వాల్తేరు డివిజిన్ ను ఒడిశాకు కట్టబెట్టి ఏపీని మళ్లీ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో గంటా స్పందిస్తూ..’వైజాగ్ రైల్వేజోన్ ఏర్పాటులోనూ రాష్ట్ర విభ‌జ‌నలాంటి అన్యాయ‌మే. అప్పుడు ఆదాయం ఉన్న‌ హైద‌రాబాద్ ను తెలంగాణ‌కు ఇచ్చేశారు. ఇప్పుడు రూ.6,500 కోట్లు తెచ్చే వాల్తేరు డివిజ‌న్‌ను ఒడిశాకు క‌ట్ట‌బెట్టి మళ్ళీ మోసం చేశారు. MODI cheated AP again’ అని ట్వీట్ చేశారు.

More Telugu News