Helicopter: బుద్గాంలో కూలిన చాపర్.. ఆరుగురు వాయుసేన సిబ్బంది మృతి

  • ప్రమాదానికి తెలియని కారణాలు 
  • హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో ఉన్న ఓ పౌరుడు కూడా మృతి 
  • శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘటన

జమ్ముకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో నిన్న భారత వాయసేనకు చెందిన ఎం1-17 రవాణా హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆరుగురు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది మృతి చెందారు. చాపర్ కూలిన ప్రాంతంలో ఉన్న ఓ పౌరుడు కూడా మృతి చెందాడు. చాపర్ ఎందుకు కూలిందన్న విషయం తెలియరాలేదు. రష్యా తయారీ అయిన ఈ చాపర్ శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పది కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. చాపర్ కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్పందించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి పరుగులు పెట్టి అందులో చిక్కుకుపోయిన వారిని రక్షించే ప్రయత్నం చేశారు.

ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, ఎందుకు కూలిందన్న వివరాలు తెలియాల్సి ఉందని బుద్గాం అదనపు డిప్యూటీ కమిషనర్ ఖుర్షీద్ అహ్మద్ షా తెలిపారు. మృతి చెందిన వారిలో ఆరుగురు వాయుసేన సిబ్బందని, ఒకరు పౌరుడని పేర్కొన్నారు. పౌరుడి పేరు కిఫాయత్ అహ్మద్ గనై అని, చాపర్ కూలిన ప్రాంతంలో ఉండడంతో ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు.

More Telugu News