Rai Lakshmi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వచ్చే నెల 15న 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' 
  • 'అరవింద సమేత' హిందీ వెర్షన్ రెడీ 
  • అడవి శేష్ తో మహేశ్ నిర్మించే చిత్రం

*  రాయ్ లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' చిత్రం మార్చ్ 15న విడుదల కానుంది. కిశోర్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హారర్ కథాంశం నేపథ్యంలో రూపొందింది.
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత' చిత్రం హిందీ అనువాద హక్కులను జీ సినిమా చానెల్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా అనువాద కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో జీ సినిమా చానెల్ లో ఈ చిత్రాన్ని ప్రసారం చేస్తారు.
*  సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థతో కలసి హీరో మహేశ్ బాబు చిత్ర నిర్మాణాన్ని చేబడుతున్నాడు. ఈ క్రమంలో అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో 'మేజర్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో దీనిని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు.

More Telugu News