India: పాకిస్థాన్ ప్రజలు నన్ను కొడుతుంటే అక్కడి ఆర్మీ కాపాడింది: పట్డుబడ్డ పైలెట్ అభినందన్

  • తానూ క్షేమంగానే ఉన్నానన్న అభినందన్
  • తాజా వీడియో విడుదల చేసిన పాక్ ప్రభుత్వం
  • అభినందన్ ని ప్రశ్నిస్తున్న పాకిస్థాన్ మేజర్ 

పాకిస్థాన్ ప్రజలు తనను కొడుతుంటే అక్కడ ఆర్మీ కాపాడిందని పాక్ కు పట్టుబడ్డ భారత పైలెట్ విక్రమ్ అభినందన్ అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. తాను క్షేమంగానే ఉన్నానని అభినందన్ మాట్లాడటం మనకు కనబడుతుంది. భారత్ విమానాల కూపీ లాగేందుకు, మిషన్ వివరాలు చెప్పమని అభినందన్ ని పాకిస్థాన్ మేజర్ ప్రశ్నించడం గమనించవచ్చు. అభినందన్ ని అడిగిన ప్రశ్నల్లో కొన్ని..


పాక్ అధికారి: నీ పేరు ఏంటి?
అభినందన్: అభినందన్.
పాక్ అధికారి: నీకు ఈ రోజు బాగా గడించిందని అనుకుంటున్నాను.
అభినందన్: అవును... నేను స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్నాను. నేను నా దేశానికి వెళ్లినా కూడా ఇది మారదు. పాక్ ఆర్మీ అధికారులు నన్ను బాగా చూసుకున్నారు. నన్ను స్థానిక మూకల నుంచి పాక్ కెప్టెన్ ఒకరు రక్షించారు. పాక్ ఆర్మీని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను.
పాక్ అధికారి: అయితే నువ్వు వింగ్ కమాండర్ వా? ఇండియాలో ఎక్కడి వాడివి?
అభినందన్: క్షమించండి... నేను చెప్పలేను... దక్షిణ భారతావనికి చెందినవాడిని.
పాక్ అధికారి: నెువ్వు దక్షిణ భారతావనికి చెందిన వ్యక్తివా? సరే... నీకు పెళ్లయిందా?
అభినందన్: అవును అయింది.
పాక్ అధికారి: నీకు మేమిచ్చిన టీ నచ్చినట్లుంది.
అభినందన్: టీ చాలా బాగుంది... కృతజ్ఞతలు.
పాక్ అధికారి: నువ్వు ఏ విమానాలు నడపగలవు?
అభినందన్: క్షమించండి... ఈ విషయాన్ని నేను చెప్పలేను.
పాక్ అధికారి: నీ మిషన్ ఏంటి?
అభినందన్: నేను చెప్పలేను.
పాక్ అధికారి: ఓకే థ్యాంక్యూ...

పాకిస్థాన్ ఆర్మీ ట్విట్టర్ లో విడుదల చేసిన ఈ వీడియోను మీరు కూడా చూడవచ్చు.

More Telugu News