India: భారత ఆటగాళ్ల విషయంలో ఆందోళన వద్దు.. పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటాం: ఐసీసీ సీఈవో

  • భద్రత గురించి రాహుల్ జోహ్రీ ఆందోళన
  • ఐసీసీ సమావేశంలో పాల్గొన్న జోహ్రీ
  • భద్రత అంశం మినిట్స్‌లో నమోదు

భారత్-పాక్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచకప్‌కు హాజరవుతున్న క్రికెటర్ల భద్రత విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ సమావేశంలో బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ భారత ఆటగాళ్ల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసినట్టు బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.

అయితే భారత ఆటగాళ్లు, అధికారులు, అభిమానుల రక్షణ విషయంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని ఐసీసీ హామీ ఇచ్చింది. భారత్ ఆందోళన చెందొద్దని.. పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటామని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్ సన్ బీసీసీఐకి హామీ ఇచ్చారు. ఐసీసీ అజెండాలో భద్రతకు సంబంధించిన అంశాలు లేనప్పటికీ బీసీసీఐ కోరిక మేరకు మినిట్స్‌లో నమోదు చేశారు.

More Telugu News