India: ఢిల్లీలో ముగిసిన బీజేపీ యేతర పక్షాల సమావేశం.. ‘పాక్’ దురాగతాలను ఖండించిన నేతలు

  • భేటీలో పాల్గొన్న 21 రాజకీయ పార్టీలు
  • ఉగ్రవాదులపై సైనిక చర్యల పట్ల హర్షం
  • భద్రతా దళాల త్యాగాలను రాజకీయ లబ్ధికి వాడుకోవద్దన్న నేతలు

పాకిస్థాన్ దురాగతాలను నేతలంతా ఖండించారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన బీజేపీ యేతర పక్షాల సమావేశం ముగిసింది. పుల్వామా దాడి ఘటనను 21 రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. భద్రతా దళాల త్యాగాలను రాజకీయ లబ్ధికి వాడుకోవాలని నేతలు చూస్తున్నారని ఆరోపించారు. సంకుచిత రాజకీయాల కోసం జాతి భద్రతను పణంగా పెట్టకూడదని, అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించలేదని ఆరోపించారు.

అనంతరం, మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, ఉగ్రవాదులపై సైనిక చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. అదృశ్యమైన భారత పైలెట్ గురించి ఆందోళన చెందుతున్నామని, సార్వభౌమాధికార రక్షణలో జాతి అభిమతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

ఈ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ కవ్వింపు చర్యలను తీవ్రంగా ఖండించామని, ఇలాంటి సమయంలో జాతి ప్రయోజనాలు పణంగా పెట్టకూడదని అన్నారు. దేశ సమగ్రత కోసం ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ కు తమ సంఘీభావం తెలియజేశామని అన్నారు. వారు చేసిన కృషిని ప్రశంసించామని చెప్పారు.

More Telugu News