Raviteja: మళ్లీ మొదటికొచ్చిన రవితేజ 'డిస్కో రాజా'?

  • రవితేజకి వరుస పరాజయాలు
  • వీఐ ఆనంద్ కి గ్రీన్ సిగ్నల్ 
  • చివరి నిమిషంలో కథలో మార్పులు    

రవితేజ 'రాజా ది గ్రేట్ ' తరువాత చేసిన సినిమాలేవీ ఆయనకి విజయాన్ని తెచ్చిపెట్టలేదు. దాంతో ఆయన కొత్తగా ట్రై చేయాలనే ఉద్దేశంతో, దర్శకుడు వీఐ ఆనంద్ వినిపించిన కథను ఓకే చేసేశాడు. 'ఎక్కడికిపోతావు చిన్నవాడా'తో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న వీఐ ఆనంద్, ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే రవితేజ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ సెట్స్ పై వున్న ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కథకి .. ఈ కథకి కొన్ని దగ్గర పోలికలు వున్నాయట. ఈ విషయం రవితేజ దృష్టికి రావడంతో, తమ కథలో ఆ పోలికలు ఎక్కడా కనిపించకుండగా మార్పులు చేయమని వీఐ ఆనంద్ కి చెప్పినట్టుగా సమాచారం. దాంతో వీఐ ఆనంద్ అదే పనిలో వున్నాడని అంటున్నారు. ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్ రవితేజకి సంతృప్తిని కలిగించిన తరువాతనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న మాట.

More Telugu News