balakrishna: బాలయ్య సినిమాకి కల్యాణ్ రామ్ పారితోషికం తీసుకోలేదట!

  • హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్
  •  బాబాయ్ సినిమాకే తొలి ప్రాధాన్యం
  • పారితోషికం తీసుకోమన్న బాలయ్య

మొదటి నుంచి కూడా బాలకృష్ణ పట్ల కల్యాణ్ రామ్ ప్రేమాభిమానాలు చూపుతూ వచ్చాడు. బాలకృష్ణ సొంత బ్యానర్లో నిర్మితమైన ఎన్టీఆర్ బయోపిక్ లో తన తండ్రి హరికృష్ణ పాత్రను పోషించాడు. అంతేకాదు ఈ సినిమా వేడుకలలోను .. ప్రమోషన్స్ లోను చురుకుగా పాల్గొన్నాడు. ప్రస్తుతం హీరోగా బిజీగా వున్న ఆయన, ఎన్టీఆర్ బయోపిక్ షూటింగును బట్టి, తాను చేస్తోన్న మరో సినిమా డేట్స్ మార్చుకుంటూ వచ్చాడు.

అలా బాలకృష్ణ సినిమాకి తొలి ప్రాధాన్యతనిస్తూ ఆయన 25 రోజుల పాటు షూటింగులో పాల్గొన్నాడట. అందువల్లనే బాలకృష్ణ .. కల్యాణ్ రామ్ ను ప్రత్యేకించి పిలిపించి పారితోషికం తీసుకోమని చెప్పారట. 'నేను నటించింది మా బాబాయ్ సినిమాలో .. పోషించింది మా నాన్నగారి పాత్ర. అలాంటప్పుడు ఈ సినిమాకి పారితోషికం ఎలా తీసుకుంటాను?' అంటూ ఆయన సున్నితంగా తిరస్కరించాడట. బాబాయ్ బాలకృష్ణ ఎంతగా బలవంతం చేసినా కల్యాణ్ రామ్ తీసుకోలేదనే విషయాన్నే ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. 

More Telugu News