oic: ఇస్లామిక్ కోఆపరేషన్ సదస్సును బహిష్కరించిన పాకిస్థాన్

  • ఓఐసీ సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరవుతున్న సుష్మా స్వరాజ్
  • అభ్యంతరం వ్యక్తం చేసిన పాకిస్థాన్
  • ఓఐసీలో 57 సభ్య దేశాలు

పాకిస్థాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అరబ్ దేశాల ప్రతిష్టాత్మక 'ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్' సదస్సును బహిష్కరించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీ ప్రకటించారు. ఈ సదస్సుకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విశిష్ట అతిథిగా హాజరుకానుండటమే దీనికి కారణం. ఈ సందర్భంగా ఖురేషీ మాట్లాడుతూ, యూఏఈ విదేశాంగ మంత్రితో మాట్లాడానని.... సుష్మాస్వరాజ్ ఈ సదస్సుకు హాజరవుతుండటంపై అభ్యంతరాలను వివరించానని చెప్పారు.

మరోవైపు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ)లో 57 సభ్య దేశాలు ఉన్నాయి. కశ్మీర్ పై మొదటి నుంచి పాకిస్థాన్ కు ఓఐసీ సానుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది.

More Telugu News