sharwanad: '96' రీమేక్ విషయంలో ఎలాంటి గొడవలు లేవట!

  • శర్వానంద్ .. సమంత జోడీగా '96'
  • ఏప్రిల్లో షూటింగ్ మొదలు 
  • ఆగస్టులో విడుదల చేసే ఆలోచన  

తమిళంలో విజయ్ సేతుపతి .. త్రిష జంటగా తెరకెక్కిన '96' మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆ సినిమా దర్శకుడు ప్రేమ్ కుమార్ తోనే తెలుగులో రీమేక్ చేయడానికి దిల్ రాజు రంగంలోకి దిగారు. నాయకా నాయికలుగా శర్వానంద్ - సమంతలను ఎంపిక చేసుకున్నారు. త్రిషను తీసుకుందామని ప్రేమ్ కుమార్ పట్టుబట్టినప్పటికీ, సమంత వైపు దిల్ రాజు మొగ్గుచూపినట్టుగా వార్తలు వచ్చాయి.

ఇక సంగీత దర్శకుడి విషయంలోను దర్శక నిర్మాతల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. తమిళ సినిమాకి చేసిన గోవింద్ మీనన్ ను తీసుకుందామని దర్శకుడు అంటే, తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కి అప్పగిద్దామని దిల్ రాజు అన్నారట. దాంతో ఇద్దరి మధ్య రంగం చెడిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతమాత్రం నిజం లేదనీ, గోవింద్ మీనన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడని టీమ్ స్పష్టం చేసింది. ఏప్రిల్లో షూటింగును మొదలుపెట్టేసి, ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

More Telugu News