GoAir: గో ఎయిర్ విమానంలో తీవ్ర కుదుపులు... ఇద్దరికి గాయాలు!

  • భువనేశ్వర్ నుంచి కోల్ కతాకు బయలుదేరిన గో ఎయిర్ విమానం
  • ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్న ప్రయాణికులు
  • గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స

భువనేశ్వర్ నుంచి కోల్ కతాకు బయలుదేరిన గో ఎయిర్ విమానం, వాతావరణం అల్లకల్లోలంగా ఉండటంతో, తీవ్ర ఒడిదుడుకులకు గురికాగా, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. భువనేశ్వర్ నుంచి 'జీ8 761' సర్వీసు టేకాఫ్ తీసుకుంది. ఆపై కాసేపటికే విమానం తీవ్ర కుదుపులకు గురైంది.

ఈ ఘటనలో విమానం సిబ్బందిలోని ఇద్దరికి గాయాలు అయ్యాయని, ప్రయాణికులంతా క్షేమమేనని, కోల్ కతాలో విమానం సేఫ్ ల్యాండింగ్ అయిందని గోఎయిర్ ప్రకటించింది. గత రెండు రోజులుగా తీర ప్రాంత వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని, ఈ కారణంగానే టర్బులెన్స్ ఏర్పడిందని తెలిపింది. విమానానికి కూడా ఎటువంటి ప్రమాదమూ జరగలేదని, కోల్ కతాలో విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే తదుపరి సర్వీస్ ను నడిపించామని ప్రకటించింది. గాయపడిన సిబ్బందికి కోల్ కతా ఎయిర్ పోర్టులో చికిత్స చేయించామని పేర్కొంది

More Telugu News