pulwama: పుల్వామా ఎఫెక్ట్... పేరు మార్చుకుంటున్న కరాచీ బేకరీ!

  • కరాచీ బేకరీల ముందు ఆందోళనకారుల నిరసనలు
  • బేకరీ యాజమాన్యంతో చర్చలు జరిపిన దత్తాత్రేయ
  • ఇండియన్ కరాచీ బేకరీగా పేరు మారుస్తామంటూ హామీ

పుల్వామా ఉగ్రదాడి అనంతరం దేశ వ్యాప్తంగా ఉన్న కరాచీ బేకరీలకు బెదిరింపులు వచ్చాయి. పాకిస్థాన్ నగరం పేరుతో ఈ బేకరీ ఉండటంతో పలుచోట్ల ఈ బేకరీల ముందు ఆందోళనకారులు నిరసన తెలిపారు. కరాచీ అనే పేరును మార్చుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కరాచీ బేకరీ యాజమాన్యం ఒక ప్రకటన చేసింది. తమ పేరును ఇకపై 'ఇండియన్ కరాచీ బేకరీ'గా మార్చుతున్నట్టు ప్రకటించింది.

 హైదరాబాద్ మొజాంజాహీ మార్కెట్ వద్ద ఉన్న కరాచీ బేకరీ యాజమాన్యాన్ని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కలిసి, వారితో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో పేరును మార్చుతామని బేకరీ యాజమాన్యం హామీ ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లో ఇండియన్ కరాచీ బేకరీ అనే పేర్లు పెడతామని చెప్పింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. 

More Telugu News