ram gopal varma: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' థియేటర్లకు వచ్చేది ఆ రోజునే

  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పైనే అందరి దృష్టి
  •  ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన 
  • మార్చి 15వ తేదీన విడుదల      

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కోసం అంతా చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించడం .. ఆ తరువాత చోటుచేసుకున్న రాజకీయ .. నాటకీయ పరిణామాలను ఈ సినిమాలో వర్మ చూపించనున్నాడు. ఇంతవరకూ వర్మ వదిలిన పోస్టర్లు .. టీజర్లు .. ట్రైలర్లకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

అసలు జరిగింది ఇది అంటూ ఆయన జనం దృష్టిని ఈ సినిమా వైపుకి మళ్లించాడు. దాంతో అందరూ విడుదల తేదీపై దృష్టిపెట్టారు. ఈ సినిమాను మార్చి 15వ తేదీన విడుదల చేయనున్నారనే టాక్ వర్మ క్యాంప్ నుంచి వినిపిస్తోంది. దాదాపు ఈ తేదీ ఖరారైపోయిందనే అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన 'కథానాయకుడు' .. 'మహానాయకుడు' ఆదరణ పొందలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది

More Telugu News