India: రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల జాబితా పంపలేదు: ప్రధాని మోదీ

  • ‘కిసాన్ సమ్మాన్ నిధి’ తొలి విడత నగదు జమ చేశాం
  • రాజస్థాన్ ప్రభుత్వం పంపే జాబితా కోసం చూస్తున్నాం
  • రైతులకు రావాల్సిన డబ్బులను అడ్డుకోవద్దు

కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు తొలి విడత నగదు జమ జరిగిందని, అయితే, ఈ విషయంలో రాజస్థాన్  ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ తమకు రైతుల జాబితా పంపలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. రాజస్థాన్ లోని చురులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, రాజస్థాన్ ప్రభుత్వం పంపే జాబితా గురించి కేంద్రం ఎదురుచూస్తోందని, రాజకీయాల కోసం రైతులకు రావాల్సిన డబ్బులను అడ్డుకోవద్దని హెచ్చరించారు. రాజస్థాన్ రైతులకు డబ్బులు వస్తే మంచిదే కదా, ఇలాంటి పథకాలను కూడా రాజకీయం చేయాలని చూస్తుంటే బాధేస్తోందని, ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో 13 లక్షల మందికి లబ్ధి చేకూరిందని చెప్పారు. నాలుగున్నరేళ్లలో పేదల కోసం 1.5 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టామని, పేదలు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేస్తున్నామని అన్నారు.

More Telugu News