modi: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు ఎయిర్ ఫోర్స్ దాడుల గురించి వివరించిన మోదీ

  • కోవింద్, వెంకయ్యలతో మోదీ భేటీ
  • వాయుసేన దాడులను వివరించిన ప్రధాని
  • అంతకు ముందు తన నివాసంలో హైలెవెల్ మీటింగ్ నిర్వహించిన మోదీ

పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు, ఆ దేశ ప్రధాన భూభాగమైన ఖైబర్ ఫక్తూంక్వా వరకు వెళ్లిన మన యుద్ధ విమానాలు... జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపత్రి వెంకయ్యనాయుడులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఎయిర్ స్ట్రైక్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ సందర్భంగా వారికి వివరించారు.

ఈ ఉదయం తన నివాసంలో హైలెవెల్ మీటింగ్ ను మోదీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏరియల్ స్ట్రైక్స్ నేపథ్యంలో, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తో పాటు అత్యున్నత స్థాయి అధికారులు హాజరయ్యారు.

More Telugu News