shraddha kapoor: 'సాహో' నుంచి సెకండ్ వీడియో వచ్చేస్తోంది

  • ప్రభాస్ జోడీగా శ్రద్ధా కపూర్
  • మార్చి 3వ తేదీన శ్రద్ధా పుట్టినరోజు
  • ఆగస్టు 15న రిలీజ్ చేసే అవకాశం

ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'సాహో' సినిమాపైనే వుంది. 'బాహుబలి 2' తరువాత వస్తోన్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు వున్నాయి. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. మార్చి 3వ తేదీన శ్రద్ధా కపూర్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేయనున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తొలి వీడియోను వదిలిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు శ్రద్ధా కపూర్ పుట్టినరోజు సందర్భంగా రెండవ వీడియోను రిలీజ్ చేయనున్నారన్న మాట. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఆగస్టు 15వ తేదీన విడుదల చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

More Telugu News