POK: ఏ ప్రాంతంలో ఏ సమయంలో దాడి జరిగిందంటే..!

  • తెల్లవారుజామున 3.45కు తొలి దాడి
  • చకోటీ ప్రాంతంలో 3.58 గంటలకు బాంబుల వర్షం
  • 4.15 గంటలకల్లా వెనక్కు వచ్చేసిన ఫైటర్ జెట్లు

మూడు ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలు టార్గెట్... ఎక్కడ బాంబు దాడులు చేయాలో ముందుగానే నిర్ణయించుకున్నారు. ఆపై శ్రీనగర్ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి మిరేజ్ యుద్ధ విమానాలు టేకాఫ్ అయ్యాయి. బాలాకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరంపై తెల్లవారుజామున 3.45 గంటల నుంచి 3.53 గంటల మధ్య తొలి దాడి జరిగింది.

భారత వాయుసేన విమానాలు బాలాకోట్ ను చేరిన మూడు నిమిషాల వ్యవధిలో మరో నాలుగు విమానాలు ముజఫరాబాద్ కు వెళ్లాయి. అక్కడి ఉగ్రవాద శిబిరంపై 3.48 గంటల నుంచి 3.58 గంటల మధ్య దాడులు జరిగాయి. అటాక్ 3లో భాగంగా చకోటీ ప్రాంతానికి వెళ్లిన ఫైటర్ జెట్స్ 3.58 నుంచి 4.04 గంటల మధ్య బాంబుల వర్షం కురిపించాయి. ఆపై 4.12 నుంచి 4.15 గంటల కెల్లా అన్ని విమానాలూ ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. తాము దాడి చేయాలనుకున్న ప్రాంతాలను యుద్ధ విమానాలు ఆటోమేటిక్ గా గుర్తించాయని, సరిగ్గా ఆ ప్రాంతంలోనే బాంబులను వేసి వచ్చాయని సైన్యాధికారి ఒకరు ప్రకటించారు.

More Telugu News