Chandrababu: టీడీపీ వాళ్లే చంద్రబాబును వెన్నుపోటు పొడవనున్నారు: రామ్ గోపాల్ వర్మ

  • కలెక్షన్లను రాబట్టడంలో విఫలం
  • టీడీపీ వాళ్లే చంద్రబాబును వెన్నుపోటు పొడవనున్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన రామ్ గోపాల్ వర్మ

గత శుక్రవారం విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' సంతృప్తికరమైన కలెక్షన్లను రాబట్టడంలో విఫలం కాగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన ట్విట్టర్ ఖాతాలో సెటైర్లు వేశారు. ఈ సినిమాను తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా చూడటం లేదని అన్నారు.

"మహా నాయకుడు కలెక్షన్స్ బట్టి ఆ సినిమాని టీడీపీ అభిమానులు కూడా చూడలేదని తేటతెల్లంగా అర్థమవుతుంది. అంటే దీనర్థం ఆ కాలంలో చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినట్టే ఈ కాలంలో టీడీపీ వాళ్లే చంద్రబాబును వెన్నుపోటు పొడవబోతున్నారని 100 శాతం గ్యారెంటీగా డబుల్ త్రిబుల్ తేటతెల్లంగా అర్థం అవుతుంది" అని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 

More Telugu News