Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రష్మికపై క్రికెట్ సన్నివేశాల చిత్రీకరణ 
  • వినాయక్ దర్శకత్వంలో రవితేజ 
  • 'తెనాలి రామకృష్ణ'గా సందీప్ కామెడీ 

*  విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'డియర్ కామ్రేడ్' చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. ఇందులో క్రికెటర్ గా నటిస్తున్న రష్మికపై ఇటీవలే కొన్ని క్రికెట్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ దృశ్యాలలో రష్మిక ప్రొఫెషనల్ క్రికెటర్ లా నటించిందని అంటున్నారు.
*  రవితేజ హీరోగా ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఓ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. వినాయక్ చెప్పిన కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.
*  సందీప్ కిషన్ హీరోగా 'తెనాలి రామకృష్ణ' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో పూర్తి కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. ఇందులో హన్సిక కథానాయికగా నటిస్తోంది.

More Telugu News