robert vadra: ఈడీ విచారణకు హాజరు కావలసిందే!: రాబర్ట్ వాద్రాకు కోర్టు ఆదేశం

  • ఈడీ విచారణపై స్టే ఇవ్వాలన్న వాద్రా విన్నపాన్ని తిరస్కరించిన కోర్టు
  • సీజ్ చేసిన డాక్యుమెంట్ల ప్రతులను వాద్రాకు ఇవ్వాలంటూ ఈడీకి ఆదేశం
  • వాద్రా తాత్కాలిక బెయిల్ మార్చి 2వ తేదీ వరకు పొడిగింపు

మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు చుక్కెదురైంది. ఈడీ విచారణపై స్టే ఇవ్వాలంటూ ఆయన చేసుకున్న విన్నపాన్ని ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. రేపు ఈడీ విచారణకు హాజరుకావాలంటూ వాద్రాను ఆదేశించింది. వాద్రా కార్యాలయంలో గత ఏడాది దాడి చేసి, సీజ్ చేసిన డాక్యుమెంట్ల హార్డ్ కాపీలను ఆయనకు అందించాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది.

సీజ్ చేసిన డాక్యుమెంట్లను తనకు ఇచ్చేంత వరకు విచారణ ఆపేసేలా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని పాటియాలా హౌస్ కోర్టుకు వాద్రా విన్నవించారు. సీజ్ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా ఈడీ తనను ఇప్పటికే విచారించిందని... ఈ క్రమంలో, సీజ్ చేసిన డాక్యుమెంట్ల ప్రతులను తనకు ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో, ఐదు రోజుల్లో వాద్రా లీగల్ టీమ్ కు డాక్యుమెంట్ల హార్డ్ కాపీలను అందజేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి వాద్రా తాత్కాలిక బెయిల్ ను మార్చి 2వ తేదీ వరకు పొడిగించింది. ఈడీ ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరు కావాలని ఆదేశించింది. 

More Telugu News