Chandrababu: ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాల వివరాలు

  • హైకోర్టులో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు
  • కొత్తగా మూడు బీసీ కార్పొరేషన్లు
  • డ్రైవర్ సాధికారిక సంస్థకు రూ. 10 కోట్ల మూలనిధి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు విషయాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే:

  • హైకోర్టులో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు
  • కొత్తగా మూడు బీసీ కార్పొరేషన్లు
  • ముత్తరాసి, తెనుగోళ్లు, ముదిరాజ్ లకు బీసీ కార్పొరేషన్
  • నాగరాలు, నాగవంశీకులకు మరో బీసీ కార్పొరేషన్
  • నీరగీత, కల్లుగీతలకు ఇంకొక బీసీ కార్పొరేషన్
  • డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 10 కోట్ల మూలనిధి
  • కార్పొరేషన్ల పరిధిలోకి రాని మిగతా 54 కులాలకు న్యాయం చేయాలని నిర్ణయం
  • బీసీ కార్పొరేషన్ కు అపెక్స్ బాడీ ఏర్పాటు
  • ఇళ్లు నిర్మించుకునే స్థితిలో జర్నలిస్టులు లేనందున... భూమి తీసుకుని వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయం
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో కలిపి, అవసరమైతే జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ను వాడుకోవాలని నిర్ణయం
  • విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పదబోడేపల్లిలో ఉన్న ఏపీఆర్ హైస్కూల్ ను రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీగా అప్ గ్రేడేషన్

More Telugu News