nani: నాని .. శర్వానంద్ మధ్య పోటీ తప్పదేమో

  • నాని హీరోగా 'గ్యాంగ్ లీడర్'
  • శర్వానంద్ హీరోగా '96' రీమేక్
  •  ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచన        

నాని కథానాయకుడిగా చేసిన 'జెర్సీ' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ లోగానే నాని .. విక్రమ్ కుమార్ ప్రాజెక్టును కూడా సెట్స్ పైకి తీసుకొచ్చేశాడు .. ఇది నానికి 24వ సినిమా. కార్తికేయ విలన్ గా చేస్తోన్న ఈ సినిమాకి, 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ ను కూడా ఖాయం చేసేశారు. ఈ సినిమాను ఆగస్టు 29వ తేదీన విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది.ఆగస్టు15వ తేదీన ప్రభాస్ 'సాహో' రానుంది గనుక, దానికి వారం ముందుగానీ .. వారం తరువాతగాని కాకుండా ఈ తేదీని విక్రమ్ కుమార్ ఫిక్స్ చేసినట్టుగా చెబుతున్నారు. ఇక శర్వానంద్ - సమంత కాంబినేషన్లో రూపొందుతోన్న '96' సినిమాను కూడా ఆగస్టులోనే విడుదల చేసే ఆలోచనలో వున్నారని సమాచారం. నాని సినిమాకి దగ్గరలోనే శర్వానంద్ సినిమా రిలీజ్ వుండే అవకాశాలు వున్నాయని చెప్పుకుంటున్నారు. నాని .. శర్వానంద్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య పోటీ తప్పదేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News