nagachaitanya: చైతూ కోసం విజయేంద్ర ప్రసాద్ 'దేవదాసు' తరహా కథ

  • 'వెంకీమామ' షూటింగులో చైతూ
  • తదుపరి సినిమా మేర్లపాక గాంధీతో
  • విజయేంద్ర ప్రసాద్ నుంచి లవ్ స్టోరీ  

అద్భుతమైన కథలను రూపొందించడంలోను .. అసాధారణమైన విజయాలను అందించడంలోను విజయేంద్ర ప్రసాద్ సిద్ధహస్తుడు. ఆయన ఒక కథను రచన చేస్తున్నాడనగానే సహజంగానే ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. అలాంటి విజయేంద్రప్రసాద్ .. నాగచైతన్య కోసం ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేస్తున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఆ కథ గతంలో అక్కినేని చేసిన 'దేవదాసు' తరహాలో కొనసాగుతుందట. విషాదాంతమైన ఈ ప్రేమకథ మనసులను కదిలించే విధంగా వుంటుందని అంటున్నారు. ఈ సినిమాకి దర్శకుడు ఎవరనే విషయం త్వరలోనే తెలియనుందని చెబుతున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా సమయం వుంది. ప్రస్తుతం 'వెంకీమామ' సినిమా షూటింగులో పాల్గొంటున్న చైతూ, ఆ తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాతనే విజయేంద్రప్రసాద్ కథతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. 

More Telugu News