Amala: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కొత్త తరహా కథా చిత్రంలో అమలాపాల్ 
  • ఆగస్టులో రానున్న నాని 'గ్యాంగ్ లీడర్'
  • వచ్చే నెలలో నయనతార 'ఐరా'  

*  అందాల కథానాయిక అమలాపాల్ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పింది. దర్శక ద్వయం అనూప్ పానికర్, అభిలాష్ పిళ్ళై దర్శకత్వం వహించే ఈ చిత్రం ఫోరెన్సిక్ క్రైం థ్రిల్లర్ గా రూపొందనుంది. ఇందులో అమలాపాల్ ఫోరెన్సిక్ సర్జన్ గా కనిపిస్తుందట.
*  నాని నటిస్తున్న 24వ చిత్రానికి 'గ్యాంగ్ లీడర్' టైటిల్ని నిర్ణయించిన సంగతి విదితమే. విక్రం కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప్రియా ఆరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది.
*  నయనతార తొలిసారిగా 'ఐరా' చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తోంది. సర్జున్ కేఎమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ వెర్షన్లను ఒకేసారి మార్చ్ 28న విడుదల చేయనున్నారు.   

More Telugu News