Andhra Pradesh: ప్రధాని అయ్యే అవకాశం లేని రాహుల్ ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు?: ఉండవల్లి

  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 150 సీట్లకు మించి రావు
  • హోదా ఎలా ఇస్తారో చెప్పాలి
  • చంద్రబాబు ప్రసంగంపై సెటైర్లు

ప్రధాని అయ్యే అవకాశం లేని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇవ్వగలరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగిన ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌-సేవ్‌ డెమోక్రసీ’ సదస్సులో పాల్గొన్న ఉండవల్లి మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రభుత్వం మారితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని రాహుల్ అన్నారని, అదెలా సాధ్యమని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 150కి మించి స్థానాలు రావని, 250 స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే తప్ప రాహుల్ పీఎం కాలేరని  ఉండవల్లి అన్నారు. కాంగ్రెస్‌కు ఏ పార్టీ మద్దతు ఇస్తుందని, హోదా ఎలా ఇవ్వగలుగుతారని కాంగ్రెస్ చీఫ్‌ను ప్రశ్నించారు. ఇక, ఏపీ సీఎం చంద్రబాబుపైనా ఉండవల్లి తీవ్ర విమర్శలు చేశారు.

ఏపీలో ఏడు మండలాలను విలీనం చేయడం చంద్రబాబు తన గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భద్రాచలం ఏపీదేనని, అది లేకుండా ఏడు మండలాలను విలీనం చేయడం వల్ల సాధించిన ఘనత ఏంటని సీఎంను ప్రశ్నించారు. చంద్రబాబు ప్రసంగం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అని, ఆయన ప్రసంగిస్తుంటే హాయిగా నిద్రపోవచ్చని ఉండవల్లి సెటైర్ వేశారు.

More Telugu News