Andhra Pradesh: పోలవరం ప్రాజెక్టు రోడ్డుపై భారీ పగుళ్లు.. భయంతో పరుగులు తీసిన సందర్శకులు, ప్రజలు!

  • ప్రాజెక్టు స్పిల్ వే రెస్టారెంట్ వద్ద ఘటన
  • రంగంలోకి దిగిన పోలవరం ప్రాజెక్టు అధికారులు
  • పగుళ్లను పూడ్చాలని కాంట్రాక్టర్ కు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు సమీపంలో మరోసారి రోడ్డుపై భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రాజెక్టు స్పిల్ వే రెస్టారెంట్ సమీపంలో భూమి ఒక్కసారిగా పగుళ్లు సంభవించాయి. దీంతో డ్యామ్ నిర్మాణాన్ని సందర్శించేందుకు వచ్చిన సందర్శకులు, ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. పగుళ్లను పూడ్చాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

ఈ విషయమై ఓ సీనియర్ ఇంజనీర్ మాట్లాడుతూ.. మట్టిలో తేమ శాతం తగ్గినప్పుడు ఇలాంటి పగుళ్లు ఏర్పడుతుంటాయని తెలిపారు. అంతేకాకుండా ప్రాజెక్టు పనుల్లో భాగంగా పేలుళ్లు జరిపినప్పుడు వదులుగా ఉన్న భూమి కుంగి పగుళ్లు ఏర్పడతాయన్నారు. ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

More Telugu News