Telangana: కేసీఆర్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. రోజుకు 20 గంటలు పనిచేస్తా!: తెలంగాణ మంత్రి శ్రీనివాసగౌడ్

  • ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తా
  • ఈ బాధ్యతలను సీఎం అప్పగించడం గౌరవంగా భావిస్తున్నా
  • మంత్రి బాధ్యతలు స్వీకరించిన టీఆర్ఎస్ నేత

తెలంగాణ ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖా మంత్రిగా టీఆర్ఎస్ నేత శ్రీనివాసగౌడ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనను నమ్మి మంత్రిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచడానికి తాను కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చే ఎక్సైజ్‌ శాఖను ముఖ్యమంత్రి తనకు అప్పగించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

రోజుకు 20 గంటల పాటు కష్టపడి పనిచేసి తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తరువాత అక్రమ రవాణా, కల్తీ మద్యం లాంటివి మాయమైపోయాయని శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యానించారు. గీత కార్మికులను ఆంధ్రా పాలకులు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. గీత కార్మికులకు కేసీఆర్‌ పెద్ద పీట వేశారనీ, కేసీఆర్ ప్రధాని అయితే దేశం రూపురేఖలే మారిపోతాయాని అభిప్రాయపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలిస్తే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారుతామని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News