Secunderabad: సమ్మర్ స్పెషల్: సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 445 ప్రత్యేక రైళ్లు

  • వేసవి రద్దీని తట్టుకునేందుకు రైల్వే ప్రణాళిక
  • ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచన
  • రైళ్ల జాబితా విడుదల

వేసవి ప్రయాణికులకు రైల్వే శుభవార్త చెప్పింది. రద్దీని తట్టుకునేందుకు ఏకంగా 445 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.  సికింద్రాబాద్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఈ రైళ్ల సేవలను ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల జాబితాను విడుదల చేసింది.

 మార్చి 1 - జూన్ 28 మధ్య:   సికింద్రాబాద్‌-కమాఖ్య-సికింద్రాబాద్‌ (రైలు నెం. 07149/07150). ఈ రైలు  నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌, జల్పాయ్‌గురి మీదుగా ప్రయాణిస్తుంది.

మార్చి 1 - జూన్ 30 మధ్య:  హైదరాబాద్‌-జైపూర్-హైదరాబాద్‌ (రైలు నెం. 02731/02732).  నిజామాబాద్‌, నాందేడ్‌, అజ్మీర్ మీదుగా ప్రయాణిస్తుంది.

మార్చి3-జూలై 3 మధ్య: సికింద్రాబాద్‌-బరౌని-సికింద్రాబాద్‌ (రైలు నెం. 07009/07010).  కాజీపేట, మంచిర్యాల, నాగ్‌పూర్‌, రాంచీ, గయ మీదుగా ప్రయాణిస్తుంది.

మార్చి 5-జూన్ 28 మధ్య:  సికింద్రాబాద్‌-రక్సౌల్ -సికింద్రాబాద్‌ (రైలు నెం. 07091/07092).  కాజీపేట, మంచిర్యాల, నాగ్‌పూర్, పాట్నా మీదుగా ప్రయాణిస్తుంది.

మార్చి 2-జూలై 2 మధ్య:  సికింద్రాబాద్‌- దర్భాంగ- సికింద్రాబాద్‌ (రైలు నెం. 07007/07008). కాజీపేట, మంచిర్యాల, నాగ్‌పూర్, పాట్నా మీదుగా ప్రయాణిస్తుంది.


మార్చి 7-జూన్ 30 మధ్య: హైదరాబాద్‌-రక్సౌల్-హైదరాబాద్‌ (రైలు నెం 07005/07006):  కాజీపేట, మంచిర్యాల, నాగ్‌పుర్‌, గయ, దర్భాంగ మీదుగా ప్రయాణిస్తుంది.

మార్చి 7-జూన్ 29 మధ్య:  హెచ్‌ఎస్‌ నాందేడ్‌-హజ్రత్‌ నిజాముద్దీన్‌-హెచ్‌ఎస్‌ నాందేడ్‌ (రైలు నెం. 02485/02486).

జూన్ 7 నుంచి 29 మధ్య:  కాచిగూడ-కాకినాడ పోర్ట్‌-కాచిగూడ (రైలు నెం.07425/07426). నల్గొండ, గుంటూరు, విజయవాడ, సామర్లకోట మీదుగా ప్రయాణిస్తుంది.

మార్చి 3-జూలై 1 మధ్య: కాచిగూడ-కృష్ణరాజపురం-కాచిగూడ (రైలు నెం. 07603/07604): మహబూబ్‌నగర్‌, కర్నూలు, హిందూపురం, యలహంక మీదుగా ప్రయాణిస్తుంది.

More Telugu News