Virat Kohli: ప్రపంచకప్ లో ఆడాలా? వద్దా?... విరాట్ కోహ్లీ స్పందన

  • ప్రభుత్వం, బీసీసీఐ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
  • దేశ ప్రజల అభీష్టం మేరకు నడుచుకుంటాం
  • ప్రస్తుతం మా దృష్టి ఆస్ట్రేలియా సిరీస్ పైనే

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ కు గట్టిగా గుణపాఠం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో టీమిండియా తలపడరాదని కొందరు, ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ ను పూర్తిగా బహిష్కరించాలని మరికొందరు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియ కెప్టెన్ కోహ్లీ దీనిపై స్పందించాడు. పాక్ తో ఆడే విషయంపై భారత ప్రభుత్వం, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకున్నా తాము శిరసా వహిస్తామని చెప్పాడు. దేశ ప్రజల అభీష్టం మేరకే తాము నడుచుకుంటామని చెప్పాడు. ప్రస్తుతం తమ దృష్టి ఆస్ట్రేలియా సిరీస్ పైనే ఉందని తెలిపాడు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపాడు.

More Telugu News