Andhra Pradesh: నా కుటుంబం రాజకీయాల్లోకి రాదు.. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు!: వెంకయ్యనాయుడు

  • మాతృభాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలి
  • ఏం చేస్తామో మేనిఫెస్టోలో పార్టీలు ప్రకటించాలి
  • నెల్లూరు జిల్లా వెంకటాచలంలో పర్యటించిన ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నెల్లూరులో నాలుగోరోజు పర్యటిస్తున్నారు. ఈరోజు వెంకటాచలంలో ఆయన వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాతృభాష పరిరక్షణకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఏం చేస్తామన్నది రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటించాలని సూచించారు. ఇక నుంచి తాను ఐదు అంశాలపై దృష్టి సారిస్తానని తెలిపారు.

ఇకపై దేశవ్యాప్తంగా పర్యటించి యువకుల్లో స్ఫూర్తి నింపుతానని వెంకయ్య అన్నారు. శాస్త్రవేత్తల పరిశోధనలు పరిశీలిస్తానని పేర్కొన్నారు. దేశంలోని రైతులను కలుసుకుంటాననీ, భారతీయ సంస్కృతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతానని వ్యాఖ్యానించారు.

తన కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రాబోరని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. వారంతా స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, కలెక్టర్ ముత్యాలరాజుతో పాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

More Telugu News