ntr: 'ఆర్ ఆర్ ఆర్' గురించి ఇప్పుడే ఏమీ చెప్పను: రాజమౌళి

  • 'ఆర్ ఆర్ ఆర్' గురించిన ఊహాగానాలు
  •  సీక్రెట్ గా ఉంచాలని అనుకోవడం లేదు
  •  చెప్పడానికి ఇది తగిన సమయం కాదు

రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్ 'సినిమా షూటింగులో బిజీగా వున్నారు. ఎన్టీఆర్ - చరణ్ కాంబినేషన్లో ఆయన ఈ సినిమా చేస్తున్నారు. విభిన్నమైన కథాకథనాలతో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా విశేషాలేవీ బయటికి రావడం లేదు. అది అలా అట .. ఇది ఇలా అట అనే ఊహాగానాలు మాత్రమే షికారు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలోను రాజమౌళి ఈ సినిమాను గురించిన విషయాలను పంచుకోవడానికి నిరాకరించారు. 'మర్యాద రామన్న' .. 'ఈగ' సినిమా కథలను నేను ముందుగానే చెప్పాను. అలాగని అన్ని సినిమాలను గురించిన విషయాలను ముందుగానే చెప్పేయడం కరెక్ట్ కాదు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని నేను అనుకోవడం లేదు. ఈ సినిమాను గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదు .. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను" అంటూ సమాధానమిచ్చారు.

More Telugu News