Jammu And Kashmir: కశ్మీర్ వేర్పాటువాద నేత అరెస్ట్.. అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • శుక్రవారం రాత్రి ఇంటిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పుల్వామా దాడి నేపథ్యంలో వేర్పాటువాద నేతలపై ఉక్కుపాదం
  • ఇప్పటికే భద్రత ఉపసంహరించిన ప్రభుత్వం

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్‌ను కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి అనంతరం వేర్పాటువాద నేతలకు భద్రతను ఉపసంహరించిన ప్రభుత్వం తాజాగా, శుక్రవారం అర్ధరాత్రి యాసిన్ మాలిక్‌ను అదుపులోకి తీసుకుంది. మైసుమా పట్టణంలోని ఆయన స్వగ్రహం నుంచి మాలిక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం కోఠిబాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  

జమ్ముకశ్మీర్‌కు చెందని వారు ఆ రాష్ట్రంలో స్థిరాస్తిని కలిగివుండడాన్ని (కొనుగోలు చేయడాన్ని) నిషేధించే ఆర్టికల్ 35-ఎపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా మాలిక్‌ను అరెస్ట్ చేయడం జరిగిందని అనధికార వర్గాల సమాచారం. 

More Telugu News