Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కాజల్ ప్రధాన పాత్రధారిగా సినిమా 
  • జూన్ నుంచి బోయపాటి ప్రాజక్ట్ 
  • '118' ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్  

 *  ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలతో కథానాయికగా బిజీగా వున్న కాజల్ అగర్వాల్ త్వరలో 'అ..' ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించనుంది. తన సొంత బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిర్మించే సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రయోగాత్మక చిత్రంగా ఉంటుందని అంటున్నారు.
*  'వినయ విధేయ రామ' చిత్రం తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణతో చేస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. జూన్ నుంచి షూటింగ్ జరుగుతుందని సమాచారం.
*  కల్యాణ్ రామ్ హీరోగా నివేదా థామస్, శాలిని పాండే హీరోయిన్లుగా రూపొందుతున్న '118' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరగనుంది. ఈ వేడుకకు ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా విచ్చేస్తాడట. మార్చ్ 1న దీనిని రిలీజ్ చేయనున్నారు.   

More Telugu News