Andhra Pradesh: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా మమ్మల్ని ఏ శక్తీ అడ్డుకోలేదు: రాహుల్ గాంధీ

  • ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
  • ఏపీలో ఏ ప్రభుత్వమున్నా మా హామీని నెరవేర్చుతాం
  • తిరుపతి బహిరంగ సభలో రాహుల్ గాంధీ

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని, హోదా ఇవ్వకుండా ఏ శక్తీ తమను అడ్డుకోలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో నిర్వహించిన ‘భరోసా సభ’లో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా 125 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఆ హామీ ఇచ్చింది సాధారణ వ్యక్తి కాదని, దేశ ప్రధాని అని గుర్తు చేశారు. ప్రధాని ఇచ్చిన హామీ అంటే దేశం ఇచ్చిన హామీ అని, పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే, ఏపీలో ఏ పార్టీ అధికారంలోకొచ్చినా, ఏ ప్రభుత్వం ఉన్నా తాము ఇచ్చిన హామీని నెరవేర్చుతామని తన ప్రసంగాన్ని కొనసాగించారు. అంతకుముందు, ప్రత్యేక హోదా కోసం గతంలో ఆత్మహత్య చేసుకున్న ముని కోటి చిత్రపటానికి రాహుల్ గాంధీ నివాళులర్పించారు.

More Telugu News