సినీ ఇండస్ట్రీకి ఓ గొప్ప దర్శకుడు దూరమయ్యారు: హాస్యనటుడు అలీ

Fri, Feb 22, 2019, 04:12 PM
  • ఒక క్యారెక్టర్ ని ఎలివేట్ చేయాలంటే కోడి రామకృష్ణే
  • ఆయన వద్ద ఒక సినిమాలో నటిస్తే చాలు
  • ఆ నటుడికి ఎంతో పేరొస్తుంది
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపై హాస్యనటుడు అలీ సంతాపం వ్యక్తం చేశాడు. ఒక క్యారెక్టర్ ని ఎలివేట్ చేయాలంటే కోడి రామకృష్ణ తర్వాతే ఎవరైనా అని, ఎందుకంటే, ఆయన వద్ద ఒక సినిమాలో నటిస్తే చాలు, ఆ నటుడికి ఎంతో పేరొస్తుందని అన్నారు. నటులు రామిరెడ్డి, బాబూమోహన్, కోట శ్రీనివాసరావుకు ఎన్నో గొప్ప క్యారెక్టర్లు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అలీ ప్రస్తావించాడు. కోడి రామకృష్ణ మన మధ్య లేరన్న వార్త వింటుంటే చాలా బాధగా ఉందని అన్నారు.

కోడి రామకృష్ణ సినిమాల్లో దాదాపు నలభై చిత్రాల్లో తాను నటించానని అన్నారు. ‘ఈటీవీ’లో తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో తాను పాల్గొంటానని కోడి రామకృష్ణ చెప్పారు కానీ, ఆ అదృష్టం తమకు దక్కలేదని చెప్పారు. ఇండస్ట్రీకి ఓ గొప్ప దర్శకుడు దూరమయ్యారని, కోడి రామకృష్ణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అలీ అన్నారు. 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Latest Video News..
Advertisement