sumanth ashwin: 'ప్రేమకథా చిత్రం 2' నుంచి యూత్ ను హత్తుకునే పాట

  • సంగీత దర్శకుడిగా జీవన్ బాబు
  •  రమ్య బెహ్రా ఆలాపన
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

గతంలో వచ్చిన 'ప్రేమకథా చిత్రం' భారీ విజయాన్ని అందుకోవడంతో, ఆ సినిమాకి సీక్వెల్ గా 'ప్రేమకథా చిత్రం 2' నిర్మితమైంది. నందిత శ్వేత ప్రధాన పాత్రధారిగా దర్శకుడు హరికిషన్ ఈ సినిమాను రూపొందించాడు. నందిత శ్వేత జోడీగా సుమంత్ అశ్విన్ నటించగా .. మరో ముఖ్యమైన పాత్రలో సిద్ధి ఇద్నాని కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

"ఆకాశమంతా కొత్తగున్నదంటా ఇంకేదీ చూడనంతగా .. మారింది అంత పూర్తిగా, నా గుండెకింత వేగమెందుకంటా .. తనేదో చూసినందుకా .. మరింతగుంది వింతగా" అంటూ ఈ పాట సాగుతోంది. జీవన్ బాబు సంగీతం .. పూర్ణాచారి సాహిత్యం .. రమ్య బెహ్రా - మహ్మద్ హైమత్ ఆలాపన బాగున్నాయి. జీవన్ బాబు బాణీ చాలా బాగుంది .. యూత్ మనసులను కొల్లగొట్టే లక్షణాలు ఈ పాటకి పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. గాయనీ గాయకులు ఇద్దరూ కూడా అద్భుతమైన ఫీల్ ను తమ స్వరంలో ఆవిష్కరించారు. మార్చి 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News